India Pakistan match: కొలంబోలో భారత్-పాక్ 'బిగ్ ఫైట్': మ్యాచ్‌కు వర్షం గండం
- బంగాళాఖాతంలో అల్పపీడనంపై శ్రీలంక వాతావరణ శాఖ హెచ్చరిక
- టోర్నీలో ఇప్పటివరకు ఓటమి ఎరుగని ఇరు జట్లు
- మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభించే అవకాశం
- టీ20 వరల్డ్ కప్‌లలో పాక్‌పై భారత్‌దే ఆధిక్యం
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా రేపు (ఫిబ్రవరి 15) చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య జరగనున్న హైవోల్టేజ్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా జరగనున్న ఈ పోరుకు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో ఈ బిగ్ మ్యాచ్ సజావుగా సాగుతుందా? లేదా? అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని శ్రీలంక వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఈ ఆందోళనలు మొదలయ్యాయి. "15వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది" అని వాతావరణ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఈ అల్పపీడన ప్రభావంతో కొలంబోలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు, ప్రముఖ వాతావరణ సంస్థ అక్యూవెదర్ నివేదిక ప్రకారం.. మ్యాచ్ ప్రారంభానికి రెండు గంటల ముందు సాయంత్రం 5 గంటలకు జల్లులు పడే అవకాశం ఉంది. అయితే, మ్యాచ్ సమయంలో వర్షం పడే సూచనలు తక్కువేనని తెలిపింది. ఆట జరిగేటప్పుడు వాతావరణం మేఘావృతమై, ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని అంచనా.
ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్, పాకిస్థాన్ జట్లు ఓటమి లేకుండా దూసుకెళ్తున్నాయి. సూపర్-8 దశకు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లకు అత్యంత కీలకం. అమెరికా, నమీబియాలపై గెలిచి భారత్ మంచి ఫామ్‌లో ఉండగా.. నెదర్లాండ్స్, అమెరికాలపై విజయాలతో పాకిస్థాన్ కూడా బలంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌లలో ఇరు జట్లు 8 సార్లు తలపడగా, భారత్ 7-1 ఆధిక్యంలో ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే, ఇరు జట్లకు చెరొక పాయింట్ లభిస్తుంది.