Krish Jagarlamudi: కాన్సెప్ట్ బాగుంది కానీ... అందులో వాస్తవం లేదు: దర్శకుడు క్రిష్

Director Krish Clarifies Rumors About His Next Movie
  • దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తదుపరి మూవీపై సోషల్ మీడియాలో వదంతులు
  • వదంతులపై తనదైన శైలిలో స్పందించిన క్రిష్ జాగర్లమూడి
  • తన కొత్త సినిమా వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తానన్న క్రిష్ జాగర్లమూడి
దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తదుపరి మూవీ అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుందని, అందులో ఏడుగురు హీరోయిన్లు నటించనున్నారనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ ప్రచారంపై స్పందించిన క్రిష్.. ఏడుగురు హీరోయిన్లు, ట్రెక్కింగ్ అడ్వెంచర్.. ఐడియా బాగుంది, కానీ ఇది నిజం కాదని అన్నారు. సోషల్ మీడియాలో పుట్టిన మరో స్క్రిప్ట్ మాత్రమేనంటూ వదంతులకు తనదైన శైలిలో పుల్‌స్టాప్ పెట్టారు. తన కొత్త సినిమా వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తానని చెప్పారు. 

గమ్యం మూవీతో దర్శకుడిగా పరిచయమైన క్రిష్, ఆ మూవీతో  తెలుగు ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని అందించిన సంగతి తెలిసిందే. తరువాత వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి ఆలోచనాత్మక చిత్రాలు, అలాగే కథానాయకుడు (ఎన్టీఆర్) వంటి బయోపిక్‌ను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన హరి హర వీరమల్లు, ఘాటి మూవీలు గత ఏడాది విడుదలయ్యాయి.
 
Krish Jagarlamudi
Krish director
Telugu cinema
Hari Hara Veera Mallu
Krish movie
Director Krish
Gamyam movie
Tollywood news
Krish next movie

More Telugu News