అల్లు శిరీశ్ పెళ్లి సందడి ప్రారంభం... ఘనంగా పసుపు దంచుడు కార్యక్రమం.. వీడియో ఇదిగో
- నయనికతో అల్లు శిరీశ్ పెళ్లి
- మార్చి 6న జరగనున్న వివాహం
- నిన్న ఇంట్లో సందడిగా జరిగిన పసుపు దంచుడు కార్యక్రమం
టాలీవుడ్ హీరో, అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీశ్ పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. నయనికతో అల్లు శిరీశ్ పెళ్లి మార్చి 6న జరగనుంది. గత నెల దుబాయ్‌లో ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిపారు. ఇప్పుడు హైదరాబాద్ లోని అల్లు అరవింద్ ఇంట్లో నిన్న సంప్రదాయబద్ధంగా పసుపు దంచుకునే కార్యక్రమం జరిగింది.
సాధారణంగా హల్దీ పేరుతో ఈ ఫంక్షన్లను జరుపుకుంటుంటారు. కానీ, హల్దీ ఫంక్షన్ కు 'నో' చెప్పి... ఇంట్లోనే సంప్రదాయ పద్ధతిలో పసుపు దంచుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ వేడుకలో పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా, బన్నీ భార్య స్నేహ, చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత, ఇతర బంధువులు, పిల్లలు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో ఈ కార్యక్రమం వీడియోను శిరీశ్ పోస్ట్ చేశాడు. ఫ్యామిలీ ఫంక్షన్ సరదాగా, సంతోషంగా సాగింది. పెళ్లి వేడుకలు ఇక మరింత జోరుగా సాగనున్నాయి.