Ambati Rambabu: అల్లు అర్జున్ సిగ్గుపడేలా అంబటి రాంబాబు సైగలు ఉన్నాయి: పంచుమర్తి అనురాధ

నిన్న గుంటూరు కోర్టుకు తరలిస్తున్న సమయంలో 'పుష్ప' సినిమా స్టైల్లో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు 'తగ్గేదే లే' అంటూ సైగలు చేసిన సంగతి తెలిసిందే. తమ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచే విధంగా ఆయన 'రప్పా రప్పా' పోజులు ఇచ్చారు. ఈ క్రమంలో అంబటిపై టీడీపీ ఎమ్మెల్సీ, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హీరో అల్లు అర్జున్ కూడా సిగ్గుపడేలా అంబటి సైగలు ఉన్నాయని ఆమె ఎద్దేవా చేశారు. 

అన్ని వర్గాల ప్రజలను దోచుకున్న అంబటి... ఇప్పుడు కులం కార్డు బయటకు తీశారని పంచుమర్తి మండిపడ్డారు. అంబటిలాంటి అరాచక శక్తులకు కులాన్ని వాడుకునే అర్హత లేదని అన్నారు. కాపులతో పాటు, ఇతర సామాజిక వర్గాలను కూడా ఇబ్బంది పెట్టిన చరిత్ర అంబటిదని దుయ్యబట్టారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ లను జగన్ తిట్టించినప్పుడు అంబటికి కాపు కులం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. బీసీలను, ఆర్యవైశ్యులను అంబటి దోచుకున్నారని  మండిపడ్డారు.  

మహిళలపై మురికి వ్యాఖ్యలు చేసిన నీచమైన వ్యక్తి అంబటి అని అనురాధ విమర్శించారు. ఆయన ఆడియో కాల్స్ బయటకు వచ్చినప్పుడే కుటుంబ సభ్యులు గడ్డి పెట్టి ఉంటే... ఈరోజు వారు రోడ్డెక్కాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదని అన్నారు. కాపులను తాగుబోతులు అన్న అంబటిని కాపు సామాజికవర్గం దగ్గరకు రానివ్వదని చెప్పారు.
Ambati Rambabu
Panchumarthi Anuradha
YSRCP
TDP
Guntur Court
Pushpa Movie
Allu Arjun
Andhra Pradesh Politics
Kapu Community

More Telugu News