Shanghai road collapse: చైనాలో హఠాత్తుగా కుంగిన రోడ్డు... సీసీటీవీలో రికార్డైన భారీ గొయ్యి

చైనాలోని షాంఘై నగరంలో రద్దీగా ఉండే రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. రోడ్డు కుంగి భారీ గొయ్యి ఏర్పడిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. నిత్యం వాహనాలతో బిజీగా ఉండే ఈ రోడ్డు కుంగిపోవడంతో ఈ ప్రభావం సమీపంలోని భవనాలపై కూడా పడింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

మెత్తటి ఒండ్రు నేలలు, నిత్యం భూగర్భ జలాల వెలికితీత, పెరుగుతున్న పట్టణ నిర్మాణం వంటి కారణాలతో షాంఘై తరుచూ ప్రమాదాల బారిన పడుతోంది. వీటి కారణంగా షాంఘైలో చిన్న చిన్న గుంతలు మొదలు భారీ గోతులు(సింగ్ హోల్స్) ఏర్పడుతున్నాయి.

రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతుండగా, అక్కడ పదుల సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్న సమయంలో రోడ్డు కుంగిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది. మొదట రోడ్డు బీటలు వారి ఆ తర్వాత క్రమంగా భారీ గొయ్యి ఏర్పడింది. భూమి కుంగిపోయిన సమయంలో అక్కడి నిర్మాణ సామాగ్రి అందులో పడిపోయాయి.

2024 జనవరిలో మిన్‌హాంగ్ జిల్లాలో మురుగునీటి పైపు పగిలిపోవడంతో రోడ్డు 10 మీటర్ల మేర కుంగింది. అయితే అప్పుడు కూడా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. 2017-2023 వరకు చైనాలోని భూమి కుంగిపోయిన ఘటనలో ఎన్నో చోటు చేసుకోగా, అందులో 72 శాతానికి పైగా మానవ తప్పిదాల వల్లనే చోటు చేసుకున్నాయి. మౌలిక సదుపాయాలు, నిర్మాణ లోపాల కారణంగా ఈ కుంగుబాట్లు చోటు చేసుకున్నాయి. షాంఘై వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయల భద్రత లోపాలను ఇది ఆందోళన కలిగిస్తోంది.
Shanghai road collapse
China sinkhole
Shanghai sinkhole
road collapse
China road accident
sinkhole accident

More Telugu News