కాకాణికి నోటీసులు జారీ చేసిన పోలీసులు
- బాలిక మృతిపై నిరాధార ఆరోపణలు చేశారని కేసు నమోదు
- ఈ నెల 14న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన కోవూరు పోలీసులు
- మైనింగ్ కేసులో ఇప్పటికే బెయిల్ పై బయట ఉన్న కాకాణి
గత కొన్ని రోజులుగా వైసీపీ నేతలకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ల అరెస్టులు, రిమాండ్లు అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వంతు వచ్చింది. ఆయనకు నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
గుమ్మలదిన్నెలో బాలిక మృతిపై నిరాధార ఆరోపణలు చేశారని, ఈ నెల 14న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. నెల్లూరులోని ఆయన నివాసంలో నోటీసులు అందజేశారు. నోటీసులపై కాకాణి ఇంకా స్పందించాల్సి ఉంది.
మరోవైపు, నెల్లూరు జిల్లాలో జరిగిన అక్రమ మైనింగ్ కేసులో కాకాణి ఇప్పటికే జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్నారు. బెయిల్ పై బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన కూటమి ప్రభుత్వంపై విమర్శల దాడిని మరింత పెంచారు.