Rahul Gandhi: రాహుల్ గాంధీకి నిధులు ఎవరిస్తున్నారు, ఆయన చేతికి పుస్తకం ఎలా వచ్చింది?: బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే

Rahul Gandhi Disqualification Demanded by BJP MP Nishikant Dubey
  • రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేసే ప్రక్రియ ప్రారంభించాలని నోటీసు
  • భారత వ్యతిరేక శక్తులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణ
  • ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఇది మొదటిసారి కాదన్న దూబే
కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే డిమాండ్ చేశారు. ఈ మేరకు అతని సభ్యత్వాన్ని రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఆయన నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాహుల్ గాంధీకి నిధులు ఎవరు ఇస్తున్నారు? ఆయన చేతికి ప్రచురితం కాని ఎంఎం నరవణె పుస్తకం ఎలా వచ్చింది? అనేది వెల్లడి కావాల్సి ఉందని అన్నారు.

భారత వ్యతిరేక శక్తులతో ఆయన సంబంధాల గురించి నోటీసులో ప్రస్తావించినట్లు తెలిపారు. లోక్ సభలో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన అన్నారు. రక్షణ, ఆర్థిక, వాణిజ్యం, విదేశాంగ వ్యవహారాలు ఇలా ఏదైనా కావొచ్చు కానీ ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంతో లక్ష్యంగా చేసుకోవడం రాహుల్ గాంధీకి ఇది మొదటిసారి కాదని అన్నారు. కానీ పార్లమెంటు, ఇతర ప్రజా వేదికలలో నిరాధారమైన, అనైతిక అంశాలను లేవనెత్తడం ద్వారా ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీకి సోరోస్ ఫౌండేషన్ అండగా ఉందని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ దేశాన్ని అంతర్గతంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కాగా, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణె రాసిన ప్రచురించబడని పుస్తకంపై పార్లమెంటులో తీవ్ర వాగ్వాదం నడిచిన విషయం తెలిసిందే.
Rahul Gandhi
Nishikant Dubey
BJP
Congress
Lok Sabha
Soros Foundation
MM Naravane
Epstein Files

More Telugu News