Udit Narayan: గాయకుడు ఉదిత్ నారాయణ్‌పై మొదటి భార్య ఫిర్యాదు
- చెకప్ కోసమంటూ ఆసుపత్రికి తీసుకువెళ్లి గర్భాశయాన్ని తొలగించారని ఫిర్యాదు
- బీహార్‌లోని సుపాల్‌లోని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
- గత ఏడాది మహిళను ముద్దు పెట్టుకోవడంతో వివాదంలో చిక్కుకున్న ఉదిత్ నారాయణ్
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్‌పై ఆయన మొదటి భార్య రంజన ఝా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 1996లో చెకప్ కోసమంటూ తనను ఆసుపత్రికి తీసుకువెళ్లి తన అనుమతి లేకుండానే గర్భాశయాన్ని తొలగించారని బీహార్‌లోని సుపాల్‌లో గల మహిళా పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. ఉదిత్ నారాయణ్‌తో పాటు ఆయన ఇద్దరు సోదరులు సంజయ్ కుమార్ ఝా, లలిత్ నారాయణ్ ఝా, రెండో భార్య దీపా నారాయణ్‌పై ఆమె ఆరోపణలు చేశారు.
ఉదిత్ నారాయణ్ గత ఏడాది కూడా వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. కాన్సర్ట్‌లో భాగంగా తనతో ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపించిన మహిళా అభిమానిని ఆయన ముద్దు పెట్టుకోవడం చర్చకు దారి తీసింది. విమర్శలు రావడంతో ఉదిత్ నారాయణ్ వివరణ ఇచ్చారు. ముద్దు పెట్టడంలో తనకు వేరే ఉద్దేశం లేదని, అభిమానులపై ఉన్న ఆప్యాయతతో అలా చేశానని పేర్కొన్నారు.