Kasturi Shankar: నేను అన్నదేమిటి, మీరు రాసిందేమిటి?... మరీ ఇంత దారుణమా?: కస్తూరి ఆగ్రహం
- కమల్ హాసన్‌పై తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపణ
- ‘ఉత్తరాంధ్ర నౌ’ అనే సోషల్ మీడియా ఖాతాపై నటి కస్తూరి ఫైర్
- తాను అనని మాటలను రాశారని తీవ్ర ఆగ్రహం
- వార్తను తొలగించి క్షమాపణ చెప్పాలని డిమాండ్
- త్యాగబ్రహ్మాన్ని కమల్ అవమానించారని తాను విమర్శించానన్న కస్తూరి
నటి, బీజేపీ నేత కస్తూరి శంకర్ ఓ మీడియా సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్‌పై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి, తప్పుడు వార్త ప్రచురించారని ఆమె మండిపడ్డారు. తాను అనని మాటలను ప్రచారం చేసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. "పార్లమెంటులో కమల్ హాసన్ తెలుగులో తన ప్రసంగం ప్రారంభించడం తమిళులను అవమానించడమేనని కస్తూరి అన్నారు" అంటూ 'ఉత్తరాంధ్ర నౌ' తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌పై కస్తూరి తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా అసత్యమని, దురుద్దేశపూరితమైన కథనమని ఆమె మండిపడ్డారు.
ఈ విషయంపై ఆమె స్పందిస్తూ, "నేను అన్నదేమిటి, మీరు రాసిందేమిటి? ఈ తప్పుడు, పరువు నష్టం కలిగించే వార్తను ఎలా సృష్టించారు? త్యాగబ్రహ్మాన్ని కించపరిచి, తెలుగు భాషను అవమానించినందుకు నేను కమల్‌ను విమర్శించాను. అంతేగానీ మీరు పేర్కొన్నట్టుగా నేను ఏమీ అనలేదు. వెంటనే మీ ఫేక్ న్యూస్‌ను వెనక్కి తీసుకోండి. నా ప్రసంగానికి సరైన అనువాదం ప్రచురించి, క్షమాపణ చెప్పండి" అంటూ 'ఉత్తరాంధ్ర నౌ'ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు.