ఇండియాను ఓడించడం పాకిస్థాన్ కు ఈజీ కాదు: సౌరభ్ గంగూలీ

  • టీ20 వరల్డ్ కప్ లో భారత్ తో ఆడేందుకు రెడీ అయిన పాకిస్థాన్
  • పాక్ సరైన నిర్ణయం తీసుకుందన్న సౌరభ్ గంగూలీ
  • రాజకీయాలు, క్రీడలు వేరని వ్యాఖ్య
టీ20 వరల్డ్ కప్ లో భారత్ తో ఆడబోమని ప్రకటించిన పాకిస్థాన్... ఎట్టకేలకు యూటర్న్ తీసుకుంది. ఐసీసీ హెచ్చరికలకు తలొగ్గి చివరకు భారత్ తో మ్యాచ్ ఆడతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పందిస్తూ... పాకిస్థాన్ చివరకు సరైన నిర్ణయం తీసుకుందని అన్నాడు. రాజకీయలు, క్రీడలు వేరని తెలిపాడు. అయితే, ఈ టోర్నీలో ఇండియాను ఓడించడం అంత ఈజీ కాదని చెప్పాడు. 

ఐసీసీతో చర్చల గురించి తనకు తెలియదని... కానీ, పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయం మాత్రం సరైనదని గంగూలీ అన్నాడు. భారత్ - పాక్ మ్యాచ్ లు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయని చెప్పాడు. అయితే, కొన్నేళ్లుగా భారత్ కు పాకిస్థాన్ గట్టి పోటీ ఇవ్వలేకపోతోందని అన్నాడు. టీమిండియా అద్భుతమైన జట్టు అని... భారత్ ను ఓడించడం పాక్ కు సులువు కాదని స్పష్టం చేశాడు.


More Telugu News