Parthiban: సీతతో విడిపోయిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నా: పార్తీబన్

Parthiban says he is very happy after separating from Seetha
షార్ట్స్‌లో చూడండి
సినీ నటి సీత, దర్శకుడు, నటుడు పార్తీబన్ 1990లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 12 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత ఇద్దరూ విడిపోయారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు ఒక కుమారుడిని దత్తత తీసుకున్నారు. విడిపోయినప్పటి నుంచి పార్తీబన్ ఒంటరిగానే ఉంటున్నారు. సీత మాత్రం మరొక వ్యక్తిని పెళ్లాడి, ఆ తర్వాత ఆయనతో కూడా విడిపోయారు. 

సీతతో తన వివాహం, విడిపోవడంపై పార్తీబన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... సీతతో విడిపోయినందుకు తాను ఎప్పుడూ బాధపడలేదని చెప్పారు. నిజం చెప్పాలంటే ఆమెతో విడాకులు తీసుకున్న తర్వాత చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. అయితే, ఆమెతో ఉన్న 12 సంవత్సరాలు తన జీవితంలో మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయిందని చెప్పారు. ఈ రోజుల్లో పురుషులు కానీ, మహిళలు కానీ వివాహం చేసుకోవడం కంటే స్వతంత్రంగా ఉండానికే ఇష్టపడతారని... ఏ మహిళ కూడా వివాహం పేరుతో పరిమితులు ఉండే జీవితాన్ని కోరుకోదని తెలిపారు. పార్తీబన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Go Back to Shorts
Parthiban
Seetha
Parthiban Seetha divorce
Tamil actor
Tamil actress
Kollywood
Divorce comments
Marriage
Relationship
Tamil cinema

More Telugu News