Kandula Durgesh: మావోయిస్టు పేరుతో బెదిరింపు లేఖ... స్పందించిన కందుల దుర్గేశ్

Kandula Durgesh responds to Maoist threat letter
  • ఎవరో ఉద్దేశపూర్వకంగా రాసి ఉంటారని మంత్రి అనుమానం
  • తన కుటుంబం ఆందోళన చెందుతోందన్న కందుల దుర్గేశ్
  • శాఖాపరంగా, వ్యక్తిగతంగా ఎక్కడా తప్పు చేయలేదన్న మంత్రి
మావోయిస్టుల పేరుతో వచ్చిన బెదిరింపు లేఖపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ స్పందించారు. ఈ బెదిరింపు లేఖతో తన కుటుంబం ఆందోళన చెందుతోందని ఆయన అన్నారు. మావోయిస్టులు బెదిరింపు లేఖ రాసేంత ఏమీ లేదని అన్నారు. ఎవరో ఉద్దేశపూర్వకంగా ఈ లేఖ రాసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తన పర్యాటక శాఖ చాలా చిన్నదని గుర్తు చేశారు.

వ్యక్తిగతంగా, శాఖాపరంగానూ తాము ఎక్కడా తప్పు చేయలేదని మంత్రి పేర్కొన్నారు. అందుకే ఎవరో కావాలని లేఖలు రాసినట్లుగా అర్థమవుతోందని పేర్కొన్నారు. తనకు వచ్చిన బెదిరింపు లేఖలపై విచారణ కొనసాగుతోందని అన్నారు. కాగా, కందుల దుర్గేశ్ సహా నలుగురు ఏపీ మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ వచ్చిన విషయం తెలిసిందే. అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, కొల్లు రవీంద్ర‌లకు కూడా బెదిరింపు లేఖలు వచ్చాయి.
Kandula Durgesh
Maoist threat letter
Andhra Pradesh Tourism Minister
Threat letter to ministers

More Telugu News