Anil Ravipudi: వీళ్లే యాక్షన్, కట్ కూడా చెప్పేట్టున్నారు: ఊహాగానాలపై అనిల్ రావిపూడి వ్యాఖ్యలు

Anil Ravipudi responds to rumors about his next film
షార్ట్స్‌లో చూడండి
వరుస విజయాలతో టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న అనిల్ రావిపూడి తన తర్వాతి చిత్రంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టారు. సోషల్ మీడియాలో తన కొత్త సినిమా హీరో, కథ, టైటిల్‌పై జరుగుతున్న ప్రచారంపై ఆయన ఆసక్తికరంగా స్పందించారు. ఇంకా ప్రాజెక్టుకు సంబంధించి తాను పేపర్‌పై పెన్ను కూడా పెట్టలేదని, అప్పుడే పూర్తి వివరాలు ఎలా ప్రచారంలోకి వచ్చాయని ఆయన ప్రశ్నించారు.

ఈ విషయంపై ఆయన స్పందిస్తూ, "నేను పేపర్ మీద కలం కూడా పెట్టలేదు. ఇంకా నటీనటులు, కథ, టైటిల్ కూడా పెట్టేశారు. ఈ ఫ్లో చూస్తుంటే యాక్షన్, కట్ కూడా చెప్పేస్తారేమో. మీ ఉత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను. అలాగే నేను చేసే సినిమా ఏంటి, ఎవరితో అనేది అతి త్వరలో నిజమైన, పూర్తి వివరాలు మీకు అందిస్తాం" అని పేర్కొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇటీవల సంక్రాంతికి వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన తదుపరి చిత్రం ఇదేనంటూ ఊహాగానాలు బయల్దేరాయి. అనిల్ రావిపూడి గత చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో ఆయన తర్వాతి సినిమాపై ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు హీరోల పేర్లు, రకరకాల కథలు ప్రచారంలోకి వస్తున్నాయి. 
Go Back to Shorts
Anil Ravipudi
Telugu cinema
Tollywood
Director
Next movie
Rumors
Chiranjeevi
Mega Star
Blockbuster hit
Manashankara Varaprasad Garu

More Telugu News