Keerthy Suresh: ఖుషీ అవుతున్న కీర్తి సురేశ్ ఫ్యాన్స్!

Keerthi Suresh Special
  • 'దసరా' తరువాత హిట్ లేని కీర్తి 
  • తమిళ సినిమాలపైనే ఎక్కువ ఫోకస్
  • 'రౌడీ జనార్దన'తో తెలుగులోనూ సందడి 
  • సరైన జోడి కుదిరిందంటున్న ఫ్యాన్స్

హీరోయిన్ గా ఛాన్స్ రావడమే కష్టం .. ఇక ఆ సినిమా హిట్ కొట్టేసి స్టార్ డమ్ దక్కడం మరింత కష్టం. అయితే ఈ విషయంలో కీర్తి సురేశ్ పెద్దగా కష్టపడలేదు. చాలా తేలికగా ఆమె వరుస విజయాలను అందుకుంటూ వెళ్లింది. స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పడం మొదలుపెట్టేసింది. అయితే మొదటి నుంచి కూడా ఆమె తమిళ సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం మనకి కనిపిస్తుంది. ఈ కారణంగా తెలుగు ప్రాజెక్టులపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. 

కీర్తి సురేశ్ ప్లానింగ్ కారణంగా తెలుగులో గ్యాప్ లేకుండా చేయలేకపోయింది. 'దసరా' తరువాత ఆమె తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేకపోయింది. తమిళంలో మాత్రం ఆమె మార్కెట్ బాగానే ఉంది. తెలుగులో ఆమె ప్రాజెక్టులు .. నిర్ణయాల విషయంలో అభిమానులు మాత్రం కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. ఆమె నుంచి సరైన సినిమా రాలేదనే అభిప్రాయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె విజయ్ దేవరకొండ జోడిగా 'రౌడీ జనార్దన' సినిమాను ఒప్పేసుకుంది. 

విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేశ్ తొలిసారిగా చేస్తున్న సినిమా కావడంతో, ఈ ప్రాజెక్టుకి ఒక్కసారిగా బజ్ వచ్చేసింది. తెరపై ఈ జోడీ చాలా బావుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. అటు విజయ్ దేవరకొండకి .. ఇటు కీర్తి సురేశ్ కి కూడా ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ ఇస్తుందని నమ్ముతున్నారు. ఇక ఈ సినిమాలో రాజశేఖర్ ఓ కీలకమైన పాత్రను చేయనున్నారని అంటున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా, డిసెంబర్లో థియేటర్లకు వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

Keerthy Suresh
Vijay Deverakonda
Rowdy Janardhan
Telugu movies
Tamil movies
Dasara movie
Dil Raju
Rajasekhar
Tollywood
South Indian cinema

More Telugu News