Shehbaz Sharif: పాకిస్థాన్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన శ్రీలంక అధ్యక్షుడు

Sri Lanka President Thanks Pakistan PM Shehbaz Sharif
  • టీ20 వరల్డ్ కప్ లో ఇండియాతో ఆడేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
  • పాక్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకే
  • పాక్ నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నామని వెల్లడి
టీ20 వరల్డ్ కప్ లో ఉత్కంఠకు తెరపడింది. ఇండియాతో ఆడేందుకు పాకిస్థాన్ సుముఖత వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే మ్యాచ్ లో ఇండియాతో ఆడేందుకు పాక్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకే ధన్యవాదాలు తెలిపారు. 

ఇండియాతో ఆడాలని పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు శ్రీలంక అధ్యక్షుడు తెలిపారు. పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నామని చెప్పారు. తాము కోరుకున్నట్టుగానే కొలంబోలో ఇండియా - శ్రీలంక మ్యాచ్ జరగబోతోందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 

ఇండియాతో ఆడకూడదంటూ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించుకోవాలని పాక్ ప్రభుత్వానికి శ్రీలంక లేఖ రాసింది. అనంతరం పాక్ ప్రధాని షరీఫ్ తో దిసనాయకే మాట్లాడారు. మరోవైపు ఐసీసీతో పాక్ క్రికెట్ బోర్డు చర్చలు జరిపింది. ఈ పరిణామాలన్నింటి తర్వాత ఇండియాతో ఆడేందుకు పాకిస్థాన్ సుముఖత వ్యక్తం చేసింది. ఒకవేళ కొలంబోలో ఇండియా - పాక్ మ్యాచ్ జరగకపోయి ఉంటే... శ్రీలంకకు భారీ నష్టం వాటిల్లేది. శ్రీలంక టూరిజం ఎంతో నష్టపోయేది. ఈ క్రమంలోనే ఇండియాతో మ్యాచ్ ఆడాలని పాకిస్థాన్ ను శ్రీలంక అభ్యర్థించింది.
Shehbaz Sharif
Sri Lanka
Pakistan
T20 World Cup
India
Cricket
Colombo
President Dissanayake
Pakistan Prime Minister
India Pakistan Match

More Telugu News