Chandrababu Naidu: చంద్రబాబు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా: సచిన్ టెండూల్కర్

Sachin Tendulkar Wishes Chandrababu Good Health and Happiness
  • ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఒకే సమయంలో ఉన్న చంద్రబాబు, సచిన్
  • చంద్రబాబు ఉన్నారనే విషయం తెలుసుకుని ఆయనను కలిసిన సచిన్
  • చంద్రబాబును కలవడం గొప్ప అనుభూతి అన్న క్రికెట్ దిగ్గజం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. నిన్న రాత్రి చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు పార్టీ ఎంపీలు స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్టు లాంజ్ లో ఆయన పార్టీ ఎంపీలతో వివిధ అంశాలపై చర్చించారు. 

మరోవైపు, అదే సమయంలో ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే ఉన్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్... ఎయిర్ పోర్టులో చంద్రబాబు ఉన్నారనే విషయం తెలుసుకుని ఆయన వద్దకు వచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు. ఇద్దరూ కాసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. అనంతరం చంద్రబాబు ఢిల్లీలోని 1-జన్ పథ్ (తన అధికారిక నివాసం)కు వెళ్లారు. సచిన్ ముంబైకి బయల్దేరారు. 

చంద్రబాబును కలిసిన విషయాన్ని సచిన్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబును కలవడం గొప్ప అనుభూతి అని సచిన్ అన్నారు. నిన్న రాత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.
Chandrababu Naidu
Sachin Tendulkar
AP CM
Andhra Pradesh
Delhi Airport
Meeting
Political News
Sachin Tendulkar meeting
Telugu News
1 Janpath

More Telugu News