Sasikala: తమిళనాట మళ్లీ ‘చిన్నమ్మ’ సందడి.. జయలలిత జయంతినాడు కీలక ప్రకటన
తమిళనాడు రాజకీయాల్లో తన ప్రాబల్యాన్ని మరోసారి నిరూపించుకునేందుకు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వి.కె. శశికళ సిద్ధమవుతున్నారు. 2026లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను బరిలోకి దింపాలని ఆమె నిర్ణయించారు. తమిళ రాజకీయాల్లో కొన్నేళ్లుగా ప్రాధాన్యం కోల్పోయిన ఆమె ఈ చర్య ద్వారా తిరిగి క్రియాశీలక శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తున్నారు.
శశికళ వర్గీయుల సమాచారం ప్రకారం ముఖ్యంగా దక్షిణ జిల్లాలు, తేవర్ సామాజికవర్గం బలంగా ఉన్న ప్రాంతాల్లో తన పట్టును పరీక్షించుకోవాలని ఆమె భావిస్తున్నారు. తన సోదరుడు వి.కె. దివాకరన్ 2018లో స్థాపించిన 'అన్నా ద్రావిడర్ కళగం' పార్టీ తరఫున ఈ అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అందులో భాగంగా ఫిబ్రవరి రెండో వారంలో కళ్లకురిచ్చి జిల్లాలో ఓ బహిరంగ సభను నిర్వహించి, కార్యకర్తలను సమీకరించాలని యోచిస్తున్నారు.
తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై జయలలిత జయంతి అయిన ఫిబ్రవరి 24న శశికళ అధికారిక ప్రకటన చేయనున్నారు. జయలలిత వారసత్వాన్ని గుర్తుచేస్తూ అన్నాడీఎంకే క్యాడర్‌ను ఆకట్టుకునేందుకే ఈ తేదీని ఎంచుకున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శశికళ, ఆస్తుల కేసులో జైలుకు వెళ్లడంతో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆమెను తిరిగి పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి అప్పట్లో స్పష్టం చేశారు. అటు మేనల్లుడు టీటీవీ దినకరన్‌తోనూ ఆమెకు సత్సంబంధాలు లేవు. అన్నాడీఎంకే లేదా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో పొత్తు ప్రయత్నాలు విఫలం కావడంతో, సొంతంగా బరిలోకి దిగి తన బలాన్ని తేల్చుకోవాలని శశికళ నిర్ణయించుకున్నారు.