అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలి: సురేఖ వాణి కూతురు సుప్రీత

  • తన తల్లికి మంచి భాగస్వామి దొరికితే బాగుంటుందన్న సుప్రీత
  • అమ్మ పెళ్లి చేసుకోవడానికి తమ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారని వెల్లడి
  • ఆమెకు సినిమా అవకాశాలు రావడం లేదన్న సుప్రీత
టాలీవుడ్ లో అందమైన క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో సురేఖ వాణి ఒకరు. ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించిన ఆమె ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తమిళనాడులో కూడా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ, గత కొంత కాలంగా ఆమెకు సినీ అవకాశాలు తగ్గిపోయాయి. అప్పుడప్పుడు మాత్రమే ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. మరోవైపు, ఆమె కూతురు సుప్రీత హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 

సుప్రీత హీరోయిన్ గా నటించిన 'అమరావతికి ఆహ్వానం' సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుప్రీత మాట్లాడుతూ... తన తల్లి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

తన తల్లి సురేఖకు మళ్లీ పెళ్లి చేయాలనే ఆలోచన తనకు ఉందని సుప్రీత తెలిపింది. ఇదే విషయాన్ని ఇటీవల అమ్మతో చెప్పానని... కానీ ఆమె మాత్రం తన తండ్రి జ్ఞాపకాలతోనే జీవించాలనుకుంటోందని చెప్పింది. తన తండ్రి స్థానంలోకి మరెవరినీ రానివ్వాలనుకోవడం లేదని తెలిపింది. అయితే, తాను పెళ్లి చేసుకునే లోపల... తన తల్లికి మంచి జీవిత భాగస్వామి దొరికితే బాగుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అమ్మ మరో పెళ్లి చేసుకోవడానికి తమ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారని తెలిపారు. 

ఒకప్పుడు ఎంతో బిజీగా ఉన్న తన తల్లికి ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయాయని... ఆమె సినిమాల్లో నటించి ఏడాదిన్నర దాటిపోయిందని చెప్పింది. సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉన్నప్పటికీ... అవకాశాలు రావడం లేదని అమ్మ ఫీల్ అవుతోందని తెలిపింది.


More Telugu News