అసోం సీఎం హిమంత బిశ్వపై హైదరాబాద్ సీపీకి అసదుద్దీన్ ఒవైసీ ఫిర్యాదు
- ఓ వర్గం వ్యక్తులను తుపాకీతో కాలుస్తున్నట్లు వీడియో షేర్ చేసిన హిమంత
- హిమంతపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన అసదుద్దీన్
- ఆయన తీరు జాతీయ సమైక్యతకు విఘాతం కలిగేలా ఉందని ఆగ్రహం
అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వపై మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ వర్గం వ్యక్తులను తుపాకీతో కాలుస్తున్నట్లుగా ఉన్న వీడియోను హిమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు. సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో ఈ వీడియోను బీజేపీ తొలగించింది. ఈ వీడియోపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు.
ముస్లింలను కాల్చుతున్నట్లుగా ఉన్న హింసాత్మక వీడియో నేపథ్యంలో హిమంతపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ముస్లింలను రెచ్చగొట్టేలా దురుద్దేశపూర్వకంగా ఈ వీడియోను పోస్టు చేసినందుకు చర్యలు తీసుకోవాలని, అసోం ముఖ్యమంత్రి రెండు మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఆయన తీరు జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించేలా ఉందని మండిపడ్డారు.
ఈ మేరకు ఈ వీడియోను పోస్టు చేసిన హిమంత బిశ్వపై చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. దురదృష్టవశాత్తు, జాతి విద్వేష ప్రసంగం కొందరికి అలవాటుగా మారిందని పేర్కొన్నారు.
కొన్నేళ్లుగా హిమంత బిశ్వ శర్మకు సామాజిక మాధ్యమాల్లో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, బహిరంగ సభలు, ఇతర వేదికలలో ఒక వర్గానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. ఆయన చేసిన ప్రసంగాలు అన్ని వేదికల్లో అందుబాటులో ఉన్నాయని అన్నారు. ముస్లింలను రెచ్చగొట్టేలా మాట్లాడుతూ, రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.