ఆ జిల్లాను రద్దు చేయడంలేదు: సీఎం రేవంత్ రెడ్డి

  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా రద్దు కాదన్న సీఎం రేవంత్ రెడ్డి
  • భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తామని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెల్లడి
  • తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరిక
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రద్దు కాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విపక్షాల కుట్రలు, కుతంత్రాలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. రాజకీయ లబ్దికోసమే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్‌పై మండిపడ్డారు. 

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న భూపాల్‌పల్లి జిల్లా చెల్పూర్‌లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన – ప్రగతి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాత జిల్లాలను రద్దు చేసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. అయితే జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మాత్రమే ఆలోచన ఉందని తెలిపారు. ఈ విషయంలో ప్రజల నుంచి బహిరంగంగా సూచనలు తీసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వెల్లడించారు. 

భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తామని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రద్దు కాదని పునరుద్ఘాటించారు. తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని ఆ పార్టీ నేతలను హెచ్చరించారు. 


More Telugu News