KTR: చరిత్రలో బూతులు మాట్లాడే ఏకైక మంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు: కేటీఆర్
- సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర విమర్శలు
- చరిత్రలో రేవంత్ అంత చెత్త సీఎం ఎవరూ లేరన్న కేటీఆర్
- బూతులు మాట్లాడటం తప్ప అభివృద్ధిపై దృష్టి లేదని ఆరోపణ
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని ప్రజలకు పిలుపు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి అంత చెత్త, నీచమైన ముఖ్యమంత్రి చరిత్రలోనే ఎవరూ లేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాండూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, రేవంత్ రెడ్డి పాలనపై ఘాటుగా విమర్శలు గుప్పించారు.
"ఏ ముఖ్యమంత్రి అయినా పర్యటనకు వెళ్తే అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడతారు. కానీ, బూతులు మాట్లాడే ఏకైక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు" అని కేటీఆర్ అన్నారు. గత రెండేళ్లుగా కేసీఆర్‌ను తిట్టడం తప్ప రేవంత్ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ప్రతిరోజూ వందల కోట్లు ఎలా సంపాదించాలన్న ఆలోచనే రేవంత్ రెడ్డికి ఉందని ఆరోపించారు.
తాండూరు నర్సింగ్ కాలేజీని ఎత్తుకుపోయిన దొంగ రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని, లేదంటే రాబోయే మూడేళ్ల వరకు ఆ పార్టీ నేతలు ప్రజలకు అందుబాటులో ఉండరని అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.