శుభలేఖలు పంచడానికి వెళుతుండగా కబలించిన మృత్యువు
- మధ్యప్రదేశ్ లో బైక్ ను ఢీ కొట్టిన ఆడి కారు
- ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం
- ఈ నెల 24న వివాహం జరగాల్సిన ఇంట విషాదం
మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మితిమీరిన వేగం కారణంగా అదుపుతప్పిన ఆడి కారు ఓ ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి ఢీ కొట్టింది. దీంతో ఆ ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. శుభలేఖలు పంచేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం. వివరాల్లోకి వెళితే.. రేవా జిల్లాలోని ఛాఛాయ్ గ్రామానికి చెందిన భగవత్ విశ్వకర్మ పెద్ద కొడుకుకు వివాహం నిశ్చయమైంది. ఈ నెల 24న శుభముహూర్తం కావడంతో కుటుంబం అంతా పెండ్లి పనుల్లో నిమగ్నమైంది.
ఈ క్రమంలోనే బంధువులకు శుభలేఖలు పంచేందుకు భగవత్ తన చిన్న కొడుకు శివం, మరో దగ్గరి బంధువైన మహిళ శీతల్ తో కలిసి బైక్ పై బయలుదేరారు. రేవాలోని బంధువుల ఇంటికి వెళుతుండగా రేవా ప్రయాగ్ రాజ్ హైవేపై కోస్తా గ్రామం వద్ద వారి బైక్ ను ఆడి కారు ఢీ కొట్టింది. వెనక నుంచి వచ్చి వేగంగా ఢీ కొనడంతో భగవత్, శివం, శీతల్ ముగ్గురూ ఎగిరి దూరంగా పడ్డారు. తీవ్ర గాయాలతో ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు. వారు ప్రయాణిస్తున్న బైక్ తుక్కుతుక్కుగా మారింది. ఈ ప్రమాదంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది.