Jayaram: ‘అల వైకుంఠపురములో’ షూటింగ్‌లో ఆసక్తికర విషయాన్ని పంచుకున్న జయరామ్

Jayaram shares interesting incident from Ala Vaikunthapurramuloo shooting
  • తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మలయాళ నటుల్లో జయరామ్ ఒకరు
  • తనకు తెలుగు అసలు రాదన్న స్టార్ యాక్టర్
  • బన్నీ ఛాతీ, నుదురు మీద డైలాగ్ పేపర్ అతికించామని వెల్లడి
మలయాళ సినీ స్టార్లకు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ ఉన్న మలయాళ నటుల్లో జయరామ్ ఒకరు. ఎన్నో సంవత్సరాలుగా ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 'భాగమతి' సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన జయరామ్... ఎన్నో భారీ చిత్రాల్లో నటించారు. 

అల్లు అర్జున్ సూపర్ హిట్ మూవీ 'అల వైకుంఠపురములో' సినిమాలో బన్నీ తండ్రి పాత్రలో ఆయన అద్భుతమైన నటనను కనబరిచారు. తాజాగా ఓ మలయాళ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ సినిమా షూటింగ్ సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఆసక్తికర విషయాన్ని గుర్తుచేసుకున్నారు. 

తనకు తెలుగు భాష అసలు రాదని... డైలాగులు ఎన్నిసార్లు చదివినా గుర్తుండేవి కాదని జయరామ్ తెలిపారు. దీంతో, తనకు ఒక ఐడియా వచ్చిందని... డైలాగ్ ను ఒక కాగితంపై రాసి, దాన్ని అల్లు అర్జున్ ఛాతీ, నుదురుపై అతికించమని అడిగానని... దానికి బన్నీ నవ్వుతూ అంగీకరించారని చెప్పారు. ఆ విధంగా ఆయన ముఖంపై ఉన్న కాగితాన్ని చూస్తూ తాను డైలాగులు పూర్తి చేశానని తెలిపారు. 
Jayaram
Ala Vaikunthapurramuloo
Allu Arjun
Telugu cinema
Malayalam actor
Tollywood
Bhagamati
Movie shooting
Telugu dialogues
Film industry

More Telugu News