'మా ఇంటి బంగారం' టీమ్‌కు మెగా ప్రశంసలు.. సమంతకు సారె పెట్టిన చిరంజీవి దంపతులు

Mega praise for Maa Inti Bangaram team Chiranjeevi and Surekha gift traditional Sare to Samantha
  • 'మా ఇంటి బంగారం' చిత్ర బృందాన్ని అభినందించిన చిరంజీవి
  • సమంత-రాజ్ నిడిమోరు జంటకు సారె పెట్టిన చిరు, సురేఖ
  • దర్శకురాలు నందిని రెడ్డితో కలిసి మెగాస్టార్‌ను కలిసిన టీమ్
  • తొలి వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ.43 కోట్లు రాబట్టిన సినిమా
సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా విజయం సాధించడంతో మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కొత్త జంట సమంత, రాజ్ నిడిమోరులకు చిరంజీవి, సురేఖ దంపతులు సారె పెట్టి ఆశీర్వదించారు. ఈ ఆత్మీయ కలయికకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నిన్న‌ సాయంత్రం సమంత, రాజ్ నిడిమోరు, దర్శకురాలు నందిని రెడ్డితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సమంతకు చీర, ఒక శంఖాన్ని బహూకరించి చిరంజీవి-సురేఖ దంపతులు ఆత్మీయతను చాటుకున్నారు. వారితో కాసేపు సినిమా విజయం గురించి, ఇతర విషయాల గురించి ముచ్చటించారు. ఈ మెగా ‘బంగారం’ మూమెంట్‌కు సంబంధించిన ఫొటోలను చిత్ర బృందం పంచుకుంది.

నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తోంది. మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ, వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. తొలి వారాంతంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.43 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందాన్ని చిరంజీవి అభినందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Go Back to Shorts
Chiranjeevi
Samantha
Maa Inti Bangaram
Nandini Reddy
Raj Nidimoru
Telugu Cinema News

More Telugu News