‘అరెస్ట్’ ఎప్పుడు చేయాలంటే.. పోలీసులకు సుప్రీం కీలక ఆదేశాలు
- ప్రశ్నించాలనే కారణంతో అరెస్ట్ చేస్తానంటే కుదరదని హెచ్చరిక
- ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ఇష్టారీతిన అరెస్టులు సరికాదని వ్యాఖ్య
- దర్యాప్తుకు తప్పనిసరి అని భావించినపుడే అరెస్ట చేయాలని సూచన
కేసు విచారణలో భాగంగా ఎవరినైనా ప్రశ్నించేందుకు అరెస్టు చేయడం సరికాదని దేశ అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా ఏడేళ్ల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో ఎడాపెడా అరెస్టులు కుదరవని స్పష్టం చేసింది. కేవలం ప్రశ్నించాలనే కారణంతో అరెస్టు చేయడాన్ని తప్పుబట్టింది. దర్యాప్తులో భాగంగా తప్పనిసరి అని భావించినపుడు ముందస్తుగా నోటీసు జారీ చేశాక అరెస్టు చేయాలని పోలీసులకు సూచించింది.
భారత న్యాయ సంహిత ప్రకారం నోటీసులు జారీ చేసినప్పటికి అరెస్టు తప్పనిసరి కాదని తేల్చిచెప్పింది. ఈ మేరకు సతేందర్ కుమార్ అంటిల్ వర్సెస్ సీబీఐ కేసులో జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్ కే సింగ్ ల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛతో కూడుకున్న విషయం కాబట్టి అరెస్టుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులకు సూచించింది.
సుప్రీం బెంచ్ సూచనలు ఇవే..
క్రిమినల్ కేసుల్లో ఫిర్యాదు అందిన తర్వాత రెండు దశల పద్ధతిని పాటించాలని దర్యాప్తు అధికారికి కోర్టు సూచించింది. సదరు కేసు విచారణలో అరెస్టు తప్పనిసరా? కాదా?.. బీఎన్ఎస్ సెక్షన్ 33, సెక్షన్ 35 ప్రకారం అరెస్టు చెయ్యవచ్చా? లేదా? అనేది వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలని పేర్కొంది. ఈ ప్రక్రియలో ఆర్టికల్ 21 (వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కు) ప్రకారం పౌరులకు కల్పించిన హక్కుల ఉల్లంఘన జరగకుండా జాగ్రత్తపడాలని హెచ్చరించింది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు అందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని; నిందితుడు, సహ నిందితుడనే భేదాలు ఏవీ మినహాయింపు కాదని స్పష్టం చేసింది. అదే సమయంలో అరెస్టుకు సంబంధించి పోలీసులకు చట్టం కల్పించిన మినహాయింపులనూ సుప్రీంకోర్టు ప్రస్తావించింది. బీఎన్ఎస్ సెక్షన్ 35(1)(బి) ప్రకారం.. ఎలాంటి వారెంట్ లేకున్నా పోలీసులు అరెస్టు చేయవచ్చనే నిబంధనను ప్రస్తావిస్తూ.. ఈ రూల్ ప్రకారం వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్టు చేయొచ్చని భావించరాదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.