Maryam Nawaz: పాకిస్థాన్‌లో ఆర్థిక ఇబ్బందులు.. మ్యాన్ హోల్ మూతలు ఎత్తుకెళితే 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామన్న ప్రభుత్వం

Maryam Nawaz Warns of Jail for Manhole Cover Theft in Pakistan
షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్‌లో ఆర్థిక అనిశ్చితి తీవ్రంగా ఉంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 45 శాతం పౌరులు పాకిస్థాన్‌లో పేదరికంలో ఉన్నారు. ఇప్పుడక్కడ మ్యాన్ హోల్ మూతలను దొంగిలించే స్థాయికి, అలా దొంగిలించిన వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసే స్థాయికి ఆర్థిక ఇబ్బందులు చేరుకున్నాయి. పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ మూతలు మాయమవుతున్నాయి. వాటిని ఇలా అమర్చగానే అలా ఎత్తుకుపోతున్నారు. దీంతో పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియం నవాజ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మ్యాన్ హోల్స్ మూతలు ఎత్తుకుపోవద్దని విజ్ఞప్తి చేస్తూ మరియం నవాజ్ వీడియోను విడుదల చేశారు. ఉదయం మ్యాన్ హోల్స్ మూతలు వేస్తున్నామని, రాత్రికల్లా అవి మాయమవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. వాటిని దొంగిలించవద్దని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. దొంగిలించిన మ్యాన్ హోల్స్ మూతలు అమ్మడం లేదా కొనడం చేస్తే ఏడాది నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. మ్యాన్‌ హోల్‌లో పడి ఎవరైనా మరణిస్తే బాధ్యులకు పదేళ్ళ జైలు శిక్ష, 50 లక్షల పాకిస్థానీ రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

పాకిస్థాన్‌లో మ్యాన్ హోల్స్ మూతలు దాదాపు 30 కిలోలు ఉంటాయి. వాటిని ఎత్తుకెళ్లి స్క్రాప్ మార్కెట్‌లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ మూత లేకపోవడం వల్ల లాహోర్‌లో ఒక మ్యాన్ హోల్‌లో పడి తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. 


Go Back to Shorts
Maryam Nawaz
Pakistan economy
manhole covers
theft
Punjab
Lahore
poverty
crime
financial crisis

More Telugu News