ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్

Harish Rao Challenges Revanth Reddy on Compensation to Sigachi Victims
  • సిగాచీ పరిశ్రమ మృతుల కుటుంబాలకు రూపాయి పరిహారం ఇవ్వలేదన్న హరీశ్ రావు
  • రూ.1 కోటి పరిహారం ఇచ్చినట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానన్న హరీశ్ రావు
  • సిగాచీ పరిశ్రమ మాత్రమే రూ.25 లక్షలు ఇచ్చిందన్న మాజీ మంత్రి
సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు ఈ ప్రభుత్వం రూ.1 కోటి పరిహారం ఇచ్చినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. బాధిత కుటుంబాలకు సిగాచీ పరిశ్రమ మాత్రమే రూ.25 లక్షల చొప్పున ఇచ్చిందని అన్నారు.

సిగాచీ కంపెనీలో 54 మంది ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇస్తామని చెప్పి రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. హామీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి పురుషుల బస్సు ఛార్జీలను రెండింతలు చేశారని ఆరోపించారు.

రెండేళ్ల తర్వాత మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, తాను మంత్రిగా వస్తానని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బులు పంపిణీ చేస్తే తీసుకోవాలని, ఓటు మాత్రం కారు గుర్తుకు వేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డివి వట్టి మాటలేనని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ అని ధ్వజమెత్తారు.
Advertisement
Revanth Reddy
Harish Rao
Telangana
Sigachi Industries
Sangareddy
BRS
Congress
Compensation

More Telugu News