Nagendra: హిందూపురంలో కాల్పుల కలకలం.. రౌడీషీటర్‌పై పోలీసుల ఫైరింగ్

Hindupuram Police Shoot Rowdy Sheeter Nagendra in Errrakonda
షార్ట్స్‌లో చూడండి
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో నాగేంద్ర అనే రౌడీషీటర్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బుల్లెట్ నాగేంద్ర కాలిలోకి దూసుకెళ్లి, అతను తీవ్రంగా గాయపడ్డాడు.

పోలీసుల వివరాల ప్రకారం, నాగేంద్రను అరెస్ట్ చేసేందుకు సీఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవి వెళ్లగా, అతను వారిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతుండటంతో, ఆత్మరక్షణ కోసం సీఐ ఆంజనేయులు అతనిపై కాల్పులు జరిపినట్లు సమాచారం.

నిందితుడు నాగేంద్రపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కలిపి సుమారు 90 కేసులు ఉన్నాయి. గతంలో హిందూపురంలో అత్తాకోడళ్లపై జరిగిన గ్యాంగ్‌రేప్ కేసులో కూడా ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 

చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్న నాగేంద్ర కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా ఘటన చోటుచేసుకుంది. బుల్లెట్ గాయంతో పట్టుబడిన నాగేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Nagendra
Hindupuram
Andhra Pradesh Police
Rowdy Sheeter
Firing Incident
Chilamatturu
Gang Rape Case
Karnataka
Crime News

More Telugu News