రూ.1,60,000 దిగువకు బంగారం, రూ.30 వేలు తగ్గిన వెండి ధర

  • హైదరాబాద్ మార్కెట్‌లో రూ.1,59,680 పలికిన 24 క్యారెట్ల పసిడి
  • నిన్నటి ధరతో పోలిస్తే రూ.6,600 తగ్గుదల
  • రూ.2,69,000 స్థాయికి దిగొచ్చిన వెండి ధర
బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. ఈ వారం ప్రారంభంలో భారీగా క్షీణించిన బంగారం ధరలు, ఆ తర్వాత రెండు రోజులు పెరిగాయి. ఈరోజు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నిన్న రూ.7 వేలకు పైగా పెరిగిన పసిడి ధర, ఈరోజు దాదాపు అంతేస్థాయిలో దిగివచ్చింది.

దీంతో హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,59,680 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,41,550 పలికింది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 24 క్యారెట్ల బంగారం ధర రూ.6,600 తగ్గింది. నిన్నటి ధరతో పోలిస్తే వెండి కిలో రూ.30 వేలు క్షీణించి రూ.2,69,000 వద్ద ఉంది.

వివిధ నగరాల్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఇలా ఉంది. బెంగళూరు రూ.1,59,560, చెన్నై రూ.1,62,680, ఢిల్లీ రూ.1,59,730, కోల్‌కతాలో రూ.1,59,570, ముంబైలో రూ.1,59,590గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ఖరీదైన ఈ లోహాల ధరలు తగ్గాయి. ఔన్సు బంగారం ధర 4,919 డాలర్లు, ఔన్సు వెండి ధర 79 డాలర్లుగా ఉంది. ఎంసీఎక్స్‌లో మార్చి డెలివరీ వెండి 7 శాతం మేర క్షీణించి రూ.2.49 లక్షల వద్ద ఉండగా, ఏప్రిల్ డెలివరీ బంగారం ధర రూ.1.53 లక్షల వద్ద ఉంది.


More Telugu News

Gold Price Gold Rate Today Silver Price Hyderabad Gold Rate MCX Gold Commodity Market Rupee Value