Chandrababu Naidu: రేపు చంద్రబాబు నివాసంలో కూటమి నేతల కీలక భేటీ
- తిరుమల లడ్డూ వివాదంపై చర్చించేందుకు రేపు కూటమి నేతల భేటీ
- ఉండవల్లిలో సమావేశం కానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
- ప్రజల్లోకి వెళ్లే వ్యూహం, ప్రచారంపై ప్రధానంగా చర్చించనున్న నేతలు
- తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంపైనా సమాలోచనలు
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైన తిరుమల లడ్డూ వివాదంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కూటమి నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ రేపు (ఫిబ్రవరి 5) భేటీ కానున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది.
లడ్డూ వివాదంపై ప్రజల్లోకి ఎలా వెళ్లాలి, ఏయే అంశాలను ప్రస్తావించాలి, ప్రచార కార్యక్రమాలను ఎలా చేపట్టాలనే దానిపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే ఈ విషయంపై చంద్రబాబు, పవన్ మధ్య ప్రాథమికంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రజల ముందుకు బలంగా తీసుకెళ్లి, తమ వాదనను వినిపించాలని కూటమి భావిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి రోడ్‌మ్యాప్‌ను ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది.