అజిత్ పవార్ మరణం.. పార్టీల విలీనంపై ఫడ్నవీస్‌కు శరద్ పవార్ కౌంటర్
- ఎన్సీపీ రెండు వర్గాల విలీన చర్చల్లో ఫడ్నవీస్ పాల్గొనలేదన్న శరద్ పవార్
- ఆయనకు ఈ అంశంపై మాట్లాడే హక్కు లేదన్న శరద్ పవార్
- సునేత్రా పరివార్ బాధ్యతలు స్వీకరించడాన్ని స్వాగతించిన శరద్ పవార్
శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య విలీన చర్చలు జరిగాయని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీ కొట్టిపారేసింది. అజిత్ పవార్ అన్ని విషయాలను తనతో చర్చించేవారని, పార్టీ విలీనం నిజమే అయితే ఎన్డీయేను వీడేవారని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అన్నారు. కానీ ఆయన మరణానంతరం పార్టీ విలీనం అంటూ ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై శరద్ పవార్ స్పందిస్తూ, ఎన్సీపీ రెండు వర్గాల విలీనంపై అజిత్ పవార్ సానుకూలంగా ఉండేవారని అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు జయంత్ పాటిల్‌తో చర్చలు కూడా జరుపుతున్నారని తెలిపారు. ఈ చర్చల్లో ముఖ్యమంత్రి పాల్గొనలేదని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు ఈ అంశంలో జోక్యం చేసుకునే హక్కు ముఖ్యమంత్రికి ఎక్కడిదని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్ బాధ్యతలు స్వీకరించడాన్ని స్వాగతిస్తున్నట్లు శరద్ పవార్ తెలిపారు. ప్రస్తుతం రాజకీయాలపై చర్చించే సమయం కాదని అన్నారు.