రాత్రి 11 గంటల సమయంలో మాకు ఈ కర్ణభేరి పరీక్ష ఏమిటి?: ధర్మపురి అర్వింద్
- తమ నివాసానికి దగ్గర్లో ఉన్న మసీదు స్పీకర్ నుంచి పెద్ద శబ్దం వస్తోందన్న అర్వింద్
- పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ఉన్నాయన్న ఎంపీ
- రాత్రి 11 గంటలకు ఈ శబ్దాలు ఏమిటని ప్రశ్న
మరో 15 రోజుల్లో పదో తరగతి పరీక్షలు ఉన్నాయని... ఆ తర్వాత ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని అర్వింద్ తెలిపారు. ఇలాంటి తరుణంలో రాత్రి 11 గంటలకు ఇదేమిటని ప్రశ్నించారు. "భాయ్... మీకు జాగారం కావాలంటే చేసుకోండి. మమ్మల్ని పడుకోనివ్వండి" అని అన్నారు.
మరోవైపు, అర్వింద్ ట్వీట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే ఆయన ఈ ట్వీట్ చేశారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏ ప్రార్థనా మందిరం అయినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, స్పీకర్లను తొలగించాలని మరికొందరు సూచిస్తున్నారు.