Jayaprakash Narayan: అది మోదీ మాస్టర్ క్లాస్: భారత్-అమెరికా ఒప్పందంపై జేపీ ప్రశంసలు

Jayaprakash Narayan Praises Modi on India US Deal
షార్ట్స్‌లో చూడండి
భారత్, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశానికి గొప్ప శుభవార్త అని పేర్కొంటూ, ఈ విజయం సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. క్లిష్టమైన అడ్డంకులు ఎదురైనప్పటికీ, ప్రధాని మోదీ ఎంతో సంయమనంతో వ్యవహరించి జాతీయ ప్రయోజనాలను కాపాడారని ఆయన ప్రశంసించారు.

ఈ ఒప్పందంపై జేపీ స్పందిస్తూ, "తీవ్రమైన సవాళ్ల నడుమ జాతీయ ప్రయోజనాలను ప్రోత్సహించడం, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థతో స్నేహాన్ని కాపాడుకోవడం, అదే సమయంలో జాతీయ గౌరవాన్ని నిలబెట్టడం వంటి అంశాలలో ప్రధాని మోదీ ఒక మాస్టర్ క్లాస్ ప్రదర్శించారు" అని కొనియాడారు. భారత్, అమెరికా దేశాలు సహజ మిత్రపక్షాలని, ఈ వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ ఒప్పందంతో వచ్చిన నూతనోత్సాహంతో దేశం సమ్మిళిత ఆర్థిక వృద్ధి, శ్రేయస్సు దిశగా మరింత పటిష్టంగా ముందుకు సాగవచ్చని జేపీ ఆకాంక్షించారు. ఇకపై ఒక దేశంగా మనమంతా అసంపూర్తిగా మిగిలిపోయిన ఎజెండాపై దృష్టి సారించి, అభివృద్ధి పథంలో పయనించాలని ఆయన పిలుపునిచ్చారు.


Go Back to Shorts
Jayaprakash Narayan
India US deal
Narendra Modi
Loksatta Party
India America relations
Trade agreement
Bilateral relations
Economic growth

More Telugu News