Pankaj Choudhary: మినిమం బ్యాలెన్స్ రూల్.. మూడేళ్లలో బ్యాంకులకు రూ.8 వేల కోట్ల ఆదాయం

Minimum Balance Rule Generates 8000 Crore Revenue for Banks Says Pankaj Choudhary
షార్ట్స్‌లో చూడండి
బ్యాంకు ఖాతాల్లో ఎల్లప్పుడూ మినిమం బ్యాలెన్స్ ఉంచాలని, ఆ మొత్తం లేకుంటే బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తాయని తెలిసిందే. ఇలాంటి ఖాతాల నుంచి బ్యాంకులకు పెద్ద మొత్తం వచ్చిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి తెలిపారు. మూడేళ్లలో 11 ప్రభుత్వరంగ బ్యాంకులకు ఇలా మినిమం బ్యాలెన్స్ చార్జీల కింద రూ.8,092 కోట్లు వసూలైందని చెప్పారు.

2022-23లో రూ.2,407.82 కోట్లు, 2023-24లో రూ.2,909.1 కోట్లు, 2024-25లో రూ.2,775.91 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. ఇక, ఎస్ఎంఎస్ ఛార్జీల కింద కస్టమర్ల నుంచి రూ.3,387.77 కోట్లు, పాన్‌ - ఆధార్‌ కార్డు లింక్‌ లో జాప్యానికి ఆలస్య రుసుము కింద రూ.2,335.75 కోట్లు, ఆలస్యంగా రిటర్న్‌లు దాఖలు చేసిన వారి నుంచి ఫైన్ రూపంలో రూ.7,664.94 కోట్లు వసూలు చేసినట్లు లోక్‌సభలో మంత్రి వెల్లడించారు.
Go Back to Shorts
Pankaj Choudhary
Minimum Balance Charges
Bank Charges
Public Sector Banks
SMS Charges
PAN Aadhaar Link
Late Return Filing
Finance Ministry
Indian Banks
Bank Revenue

More Telugu News