అమెరికాతో వాణిజ్య ఒప్పందం... ప్రధాని మోదీకి సన్మానం
- వాణిజ్య ఒప్పందం కోసం మోదీ చేసిన కృషికి గాను సన్మానం
- ప్రధానిని పార్లమెంటు ఆవరణలో సన్మానించిన ఎన్డీయే ఎంపీలు
- 'భారత్ మాతాకీ జై', 'వందేమాతరం' అంటూ నినాదాలు
పార్లమెంటు ప్రాంగణంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. ఈ భేటీ నేపథ్యంలో మొదట మోదీని సన్మానించారు. అనంతరం పార్లమెంటులో ప్రతిపక్షాల విమర్శలపై స్పందనలు, పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధాని మోదీ ఎంపీలకు దిశానిర్దేశనం చేశారు.
కాగా, భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించిన విషయం తెలిసిందే. భారత్‌పై ప్రతీకార సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నామని ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ ప్రకటనతో ఇప్పటిదాకా భారత్ ఉత్పత్తులపై 50 శాతం సుంకం ఉండగా ఇప్పుడు అది 18 శాతానికి తగ్గుతుంది. ఈ 50 శాతంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు 25 శాతం అదనపు సుంకం కూడా ఉంది. ఇప్పుడు అదనపు సుంకాలను తొలగిస్తున్నట్లు అమెరికా తెలిపింది.