'మన శంకర వరప్రసాద్ గారు' ఓటీటీలోకి వచ్చేస్తున్నారు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
- బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన మెగాస్టార్ కొత్త సినిమా
- రిలీజై మూడు వారాలు దాటినా తగ్గని కలెక్షన్లు
- ఈ నెల 11 నుంచి జీ 5 లో స్ట్రీమింగ్..!
ఈసారి సంక్రాంతి బరిలో మెగాస్టార్ సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులను కొల్లగొడుతూ భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఈ సినిమా కలెక్షన్లు రూ.400 కోట్ల మార్క్ ను చేరినట్లు సమాచారం.
ప్రాంతీయ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ‘మన శంకరవప్రసాద్ గారు’ రికార్డుల కెక్కింది. సినిమా విడుదలై మూడు వారాలు గడుస్తున్నా కలెక్షన్లు మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి షో నుంచే మంచి టాక్ వచ్చింది. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటించింది. అతిథి పాత్రలో విక్టరీ వెంకటేశ్ కూడా ఈ సినిమాలో కనిపించారు.
క్యాథరీన్ థెరీసా, సచిన్ ఖేడ్కర్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, శరత్ సక్సేనా తదితరులు వివిధ పాత్రల్లో నటించారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ 5 సొంతం చేసుకుంది. ఈ నెల 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.