Vijay: బీజేపీ, డీఎంకే పార్టీలపై నటుడు విజయ్ తీవ్ర విమర్శలు

Actor Vijay Criticizes BJP DMK Parties
షార్ట్స్‌లో చూడండి
బీజేపీ, డీఎంకే పార్టీలు డబ్బా ఇంజిన్, రిపేర్ ఇంజిన్‌లు అయితే తమ పార్టీ మాత్రమే టాప్ ఇంజిన్ అని టీవీకే పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ తమిళ నటుడు విజయ్ అన్నారు. తమిళగ వెట్రి కజగం (టీవీకే) మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ టాప్ ఇంజిన్‌తో ఆ పార్టీలకు పోలిక లేదని అన్నారు. తమ పార్టీ తమిళ ప్రజల కన్నీళ్లు తుడుస్తుందని, వారి కష్టాలను తీరుస్తుందని అన్నారు.

తమిళనాడులో బీజేపీ కొన్ని పార్టీలతో కూటమిగా కొనసాగుతోందని విమర్శించారు. డీఎంకేను, వివిధ పార్టీలతో కూడిన కూటమిని ఓడించడం టీవీకే పార్టీకి మాత్రమే సాధ్యమని ఆయన అన్నారు. డీఎంకే ఒంటరిగా పోటీ చేసినా, కూటమిగా వచ్చినా ఎదుర్కొనే సత్తా టీవీకేకు ఉందని అన్నారు. తమిళనాడులో డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని ఆయన స్పష్టం చేశారు. నాడు ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు ఎంజీఆర్ ఏఐఏడీఎంకేను స్థాపించారని పేర్కొన్నారు.

ఎన్నికల్లో గెలిచిన అనంతరం కూడా నాడు ఎంజీఆర్‌ను అవమానించారని గుర్తు చేశారు. అలా కొంతమంది చేస్తారని విమర్శించారు. తాము డీఎంకేను ప్రశ్నిస్తాం, వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. టీవీకేకు ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా ఉందని అన్నారు. 

కాగా, టీవీకే పార్టీ ఆవిర్భవించి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. త్వరలో తన మొదటి ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది.
Go Back to Shorts
Vijay
Tamilaga Vettri Kazhagam
TVK Party
BJP
DMK
Tamil Nadu Politics
Tamil Nadu Elections

More Telugu News