N Shankar: దర్శకుడు ఎన్.శంకర్‌ను పరామర్శించిన కేటీఆర్

KTR Consoles Director N Shankar on Mothers Demise
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ సినీ దర్శకుడు ఎన్.శంకర్ మాతృవియోగంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం శంకర్ ఇంటికి వెళ్లి ఆయన్ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. శంకర్ తల్లి సక్కుబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ... "ప్రముఖ సినీ దర్శకుడు నిమ్మల శంకర్ గారి మాతృమూర్తి నిమ్మల సక్కుబాయమ్మ గారు గత వారం స్వర్గస్తులయ్యారు. ఈ రోజు శంకర్ గారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించాను" అని తెలిపారు.

శంకర్ మాతృమూర్తి నిమ్మల సక్కుబాయి గత బుధవారం (జనవరి 28) హైదరాబాద్‌లో కన్నుమూశారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం చిరుమర్తికి చెందిన ఆమె, కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఎన్.శంకర్ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'జై బోలో తెలంగాణ', 'శ్రీరాములయ్య', 'భద్రాచలం', 'జయం మనదేరా' వంటి పలు విజయవంతమైన, సామాజిక స్పృహ ఉన్న చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. శంకర్ తల్లి మరణవార్త తెలియగానే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు.
Go Back to Shorts
N Shankar
KTR
Nimmala Sakku Bai
BRS Working President
Telangana film director
Condolences
Movie director
Jai Bolo Telangana
Political visit

More Telugu News