Ponguleti Srinivas Reddy: తెలంగాణను సంక్షోభం నుంచి గట్టెక్కిస్తూ పరుగులు పెట్టిస్తున్నాం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy says Telangana is progressing from crisis
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కిస్తూ అభివృద్ధి, సంక్షేమం దిశగా పరుగులు పెట్టిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒక్కో ఇటుకను పేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని అన్నారు. సోమవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆధునికీకరించిన సమాచార పౌరసంబంధాల శాఖ వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాలు ప్రజల జీవితాలలో స్పష్టమైన మార్పునకు నాంది పలుకుతోందని అన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం, సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఉపాధి కల్పన ఇలా అన్ని రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు తెలంగాణను ఆదర్శంగా నిలుపుతున్నాయని మంత్రి అన్నారు.

ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకుని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు వేగవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సమాచార శాఖ అధికారులకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
Go Back to Shorts
Ponguleti Srinivas Reddy
Telangana
Revanth Reddy
Telangana development
Telangana schemes

More Telugu News