Balochistan Liberation Army: ఇద్దరు మహిళా ఫిదాయీల ఫొటోలు విడుదల చేసిన బీఎల్ఏ

Balochistan Liberation Army Releases Photos of Female Fighters
  • బలూచిస్థాన్‌లో అనేక చోట్ల పోరాటం కొనసాగుతోందన్న బీఎల్ఏ
  • అనేక పట్టణ, గ్రామీణ ప్రాంతాలపై నియంత్రణ సాధించామని వెల్లడి
  • హవా, అసిఫా అనే మహిళా ఫిదాయీల ఫొటోలు విడుదల

బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) తన ఆపరేషన్ హీరోఫ్ ఫేజ్-II బలూచిస్థాన్‌లోని అనేక జిల్లాల్లో 40 గంటలకు పైగా కొనసాగుతోందని ప్రకటించింది. తమ అధికారిక ప్లాట్‌ఫాం ‘హక్కల్’ ద్వారా విడుదల చేసిన ప్రకటనల్లో... పాక్ భద్రతా బలగాలకు భారీ నష్టం జరిగిందని, ప్రావిన్స్‌లోని అనేక పట్టణ, గ్రామీణ ప్రాంతాలపై తాము నియంత్రణ సాధించామని పేర్కొంది.


గ్వాదర్‌లో జరిగిన ఘర్షణల సమయంలో రికార్డ్ చేసిన వీడియోను బీఎల్ఏ విడుదల చేసింది. ఈ వీడియోలో హవా బలోచ్ అలియాస్ ద్రోషుమ్ అనే మహిళ ఫిదాయీ ఫైటర్‌ను గుర్తించారు. ఆమె పాక్ బలగాలపై దాడి చేస్తూ మరణించిందని, మరణానికి 12 గంటల ముందు రికార్డ్ చేసిన ఆమె చివరి మెసేజ్ ఇదని బీఎల్ఏ తెలిపింది.


హవా బలోచ్ రచయిత్రి అని, ఆమె తండ్రి గతంలో బలూచ్ సాయుధ ఉద్యమంతో సంబంధం ఉండి యుద్ధంలో మరణించాడని ‘ది బలూచిస్థాన్ పోస్ట్’ సోర్సెస్ తెలిపాయి. వీడియోలో హవా బలూచ్ మహిళలను సాయుధ పోరాటంలో చేరాలని పిలుపునిచ్చింది. బలూచ్ మహిళలను, పురుషులను పాకిస్థాన్ అణచివేస్తోందని, బలూచ్ సమాజంలో మహిళలు మేధోపరంగా లేదా ఆచరణాత్మకంగా బలహీనులు కాదని చెప్పింది. “మహిళలు లేచి న్యాయం కోసం పోరాడాలి” అని ఆమె పేర్కొంది.


ఇంకో మహిళ ఫిదాయీగా 23 ఏళ్ల అసిఫా మెంగల్‌ను బీఎల్ఏ గుర్తించింది. జనవరి 31న నోష్కిలోని ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) హెడ్‌క్వార్టర్స్‌పై ఆమె వెహికల్-బోర్న్ ఐఈడీతో దాడి చేసిందని బీఎల్ఏ ప్రకటించింది. బీఎల్ఏ స్పోక్స్‌పర్సన్ జీయంద్ బలోచ్ విడుదల చేసిన ప్రకటనల్లో... ఖారాన్, మస్తుంగ్, టంప్, పస్నీలో ఆపరేషన్లు పూర్తయ్యాయని... క్వెట్టా, నోష్కిలో యుద్ధం కొనసాగుతోందని తెలిపారు.

Balochistan Liberation Army
BLA
Hawa Baloch
Asifa Mengal
Balochistan
Pakistan
Baloch Armed Movement
Guwadar
ISI Headquarters
Female Fighters

More Telugu News