వైసీపీ తీరుపై ఈసీకి లేఖ రాస్తా: గంటా శ్రీనివాసరావు

  • ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతానన్న ఎమ్మెల్యే
  • చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలను ఖండించిన గంటా
  • ఉనికి కాపాడుకోవడానికి దిగజారుడు వ్యాఖ్యలంటూ ఫైర్
ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేతలు చేసిన మురికి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నేతపై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయడంపై ఆయన మండిపడ్డారు. ఈ రోజు ఉదయం విశాఖపట్నంలో గంటా మీడియాతో మాట్లాడారు. వైసీపీ చీఫ్ జగన్ సహా ఆ పార్టీ నేతలు అంబటి రాంబాబు, రోజా, కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన అసభ్య వ్యాఖ్యల వీడియోలను ప్రదర్శించారు.

వైసీపీ నేతల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఉనికిని కాపాడుకునేందుకే అసభ్య వ్యాఖ్యలు చేస్తూ, కులాలను ఆపాదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని లేఖ రాయనున్నట్లు తెలిపారు. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అసెంబ్లీలో క్షమాపణ చెప్పారని గంటా శ్రీనివాసరావు గుర్తుచేశారు. చంద్రబాబును ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజల్లో ఆగ్రహం ఉంటుందని, వైసీపీ హయాంలోనే జగన్ ను విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో అడ్డుకున్నారని గంటా శ్రీనివాసరావు చెప్పారు.


More Telugu News