యూపీ అసెంబ్లీలో ‘కర్ణాటక స్పీకర్ సింహాసనం’
- కర్ణాటక సభలో కుర్చీని చూసి మనసుపడ్డ యూపీ స్పీకర్
- స్వల్ప మార్పులతో సేమ్ కుర్చీని తయారు చేసిచ్చిన కళాకారుడు
- కుర్చీ కోసం సుమారు 30 లక్షల ఖర్చు చేసిన యూపీ ప్రభుత్వం
గతేడాది కర్ణాటకలో జరిగిన కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సు కోసం ఉత్తరప్రదేశ్ స్పీకర్ సతీశ్ మహానా బెంగళూరుకు వచ్చారు. ఆ సమయంలో సభలో స్పీకర్ కుర్చీ ఆయనను బాగా ఆకట్టుకుంది. ఆ కుర్చీని తయారుచేసిన కళాకారుడి గురించి ఖాదర్ ను ఆరా తీశారు. యూపీ సభలోనూ ఇలాంటి కుర్చీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీంతో మైసూరుకు చెందిన కళాకారులను ఖాదర్ ఆయనకు పరిచయం చేశారు. ఆ తర్వాత చిన్న డిజైన్ మార్పులతో కర్ణాటక కుర్చీ నమూనా ఆధారంగానే కొత్త కుర్చీ తయారీకి ఏర్పాట్లు జరిగాయి.
కుర్చీ ప్రత్యేకతలు ఇవే..
రోజ్‌వుడ్‌తో తయారు చేసిన ఈ కుర్చీ.. 7.5 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పు ఉంటుంది. కుర్చీపైన గొడుగు లాంటి ఆకారం ఉంది. ఆర్మ్‌రెస్ట్ భాగంలో సింహం, ఏనుగు బొమ్మలు కళాత్మకంగా చెక్కారు. దానిపైన ఉత్తరప్రదేశ్ రాజముద్ర ఏర్పాటు చేశారు. సీటు భాగాన్ని లెదర్తో చేసినట్లు కళాకారుడు కైజర్ అలీ ఖాన్ తెలిపారు.