Viral Video: బాక్సింగ్ రింగ్‌లో ఊడిన విగ్గు.. బాక్సర్ ఫన్నీ రియాక్షన్.. ఇదిగో వీడియో!
- బాక్సింగ్ ఫైట్‌లో అమెరికన్ బాక్సర్ జారెల్ మిల్లర్‌కు వింత అనుభవం
- ప్రత్యర్థి పంచ్‌లకు రింగ్‌లోనే ఊడిపోయిన జారెల్ విగ్గు
- నవ్వుతూ విగ్గును తీసి ప్రేక్షకుల్లోకి విసిరేసిన బాక్సర్
- అమ్మ షాంపూ వల్లే జుట్టు ఊడిపోయిందని, అందుకే విగ్గు పెట్టానని వెల్లడి
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఘటనకు సంబంధించిన వీడియో
అమెరికాలోని ప్రఖ్యాత మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఓ బాక్సింగ్ మ్యాచ్ సందర్భంగా వింత ఘటన చోటుచేసుకుంది. అమెరికన్ బాక్సర్ జారెల్ "బిగ్ బేబీ" మిల్లర్, కింగ్స్లీ ఇబే మధ్య జరిగిన ఫైట్‌లో ఈ సరదా సంఘటన జరిగింది. ప్రత్యర్థి పిడిగుద్దులకు జారెల్ పెట్టుకున్న విగ్గు రింగ్‌లోనే ఊడిపోయింది. ఈ అనూహ్య పరిణామం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.
శనివారం జరిగిన ఈ బౌట్‌లోని రెండో రౌండ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కింగ్స్లీ ఇబే వరుసగా పంచ్‌లు విసరడంతో జారెల్ తలకు పెట్టుకున్న విగ్గు కదిలి, కాసేపటికి పూర్తిగా ఊడి కిందపడిపోయింది. అయితే, ఈ పరిణామానికి జారెల్ ఏమాత్రం చలించకుండా, ఆ విగ్గును తీసి ప్రేక్షకుల పైకి విసిరేశాడు. దీంతో అభిమానులు కేరింతలు కొట్టారు.
మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై జారెల్ స్పందిస్తూ ఓ ఫన్నీ కారణం చెప్పాడు. తన తల్లి వాడిన షాంపూ తను వాడడం వల్లే ఇలా జరిగిందని చెప్పి అందర్నీ నవ్వించాడు. "రెండు రోజుల క్రితం మా అమ్మ ఇంట్లో ఉన్న షాంపూతో తలస్నానం చేశాను. అది అమ్మోనియం బ్లీచ్ లాంటిది కావడంతో నా జుట్టు మొత్తం ఊడిపోయింది. అందుకే వెంటనే నా మేనేజర్‌కు ఫోన్ చేసి ఓ విగ్గు తెప్పించుకుని పెట్టుకున్నాను. నేనో కమెడియన్‌ని, నాపై నేనే జోకులు వేసుకోగలను" అని వివరించాడు.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌తో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.