Ambati Rambabu: నోరు అదుపులో ఉండాల్సిందే.. అంబటి భార్య పిటిషన్పై హైకోర్టు వ్యాఖ్యలు
- రాజకీయాల్లో ఉన్నవారు వాడే భాష సభ్య సమాజం మెచ్చేలా ఉండాలన్న కోర్టు
- శాంతిభద్రతలే కాదు, సామాజిక సామరస్యం కాపాడటం కూడా పోలీసుల విధి అని వ్యాఖ్య
- అంబటి రాంబాబు భార్య వేసిన పిటిషన్పై కోర్టు విచారణ
- భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వం చెప్పడంతో కేసు ముగింపు
రాజకీయ నాయకులు వాడే భాషపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఇతరులను కించపరిచేలా లేదా వివాదాలకు దారితీసేలా ఉండకూడదని స్పష్టం చేసింది. రాజకీయ నేతలు వాడే పదజాలం హుందాగా ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది.
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి భద్రత కల్పించాలని కోరుతూ ఆయన భార్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ ఇంటి వద్ద రక్షణ అవసరమని కోరారు. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా రాజకీయాల్లో పెరుగుతున్న భాషా కాలుష్యంపై కోర్టు స్పందించింది.
కేవలం నేరాలను అదుపు చేయడం, శాంతిభద్రతలను పర్యవేక్షించడమే పోలీసుల పని కాదని కోర్టు గుర్తుచేసింది. సమాజంలో వివిధ వర్గాల మధ్య శాంతిని, సామరస్యాన్ని పెంపొందించాల్సిన గురుతర బాధ్యత కూడా పోలీసు వ్యవస్థపై ఉందని వ్యాఖ్యానించింది.
అంబటి రాంబాబు కుటుంబానికి ఇప్పటికే తగిన భద్రత కల్పిస్తున్నట్లు ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనికి సంబంధించిన ఆధారాలను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం, సంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్ను పరిష్కరించినట్టు తెలిపింది.