Upasana Kamineni: మెగా ఇంట్లో 'డబుల్' ధమాకా: కవలలకు జన్మనిచ్చిన ఉపాసన
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. మెగా వారసురాలు క్లింకార తర్వాత, ఈ దంపతులు ఇప్పుడు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఉపాసన కొణిదెల ఒక బాబుకి, ఒక పాపకి జన్మనిచ్చినట్లు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
తల్లీ, పిల్లలు క్షేమంగా ఉన్నారని.. తమ కుటుంబం ఇప్పుడు మరింత పరిపూర్ణమైందని చిరంజీవి తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వార్త తెలియగానే సోషల్ మీడియాలో మెగా అభిమానుల హడావిడి మొదలైపోయింది. ఇప్పటికే క్లింకార రాకతో వెలిగిపోయిన మెగా సామ్రాజ్యం, ఇప్పుడు ఈ 'ట్విన్' సెలబ్రేషన్స్‌తో మరింత సందడిగా మారింది. దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఈ మెగా దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.