మిత్ర దేశాల వద్ద తల వంచి అప్పు అడుక్కొచ్చాం.. పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. వీడియో ఇదిగో!
- అప్పు ఇచ్చే వారు ఎన్నో షరతులు పెడతారని వెల్లడి
- ఐఎంఎఫ్ లోన్ గ్యాప్ పూడ్చుకునేందుకు తప్పలేదని వివరణ
- ఓ బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ వెల్లడించిన షెహబాజ్ షరీఫ్
మిత్ర దేశాలపై తమ ఆశలు ఎన్నడూ వమ్ముకాలేదని వివరించారు. అయితే, అప్పు అడిగేందుకు వెళ్లే వారి తల వంగి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందేనని షరీఫ్ గుర్తుచేశారు. అదేవిధంగా, అప్పు ఇచ్చేందుకు ఎన్నో షరతులు పెడతారని, తీసుకునే వారు విధిలేక వాటికి అంగీకరించాల్సి వస్తుందని షరీప్ వివరించారు. అయితే, మిత్ర దేశాలు ఏమేం షరతులు విధించాయనే వివరాలను షరీఫ్ వెల్లడించలేదు. తాము అడిగిన మొత్తాన్ని అప్పుగా అందజేశాయని మాత్రమే తెలిపారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడిన ఈ మాటలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.