షూటింగ్ మొదలవ్వకముందే సునామీ సృష్టిస్తున్న అల్లు అర్జున్- లోకేశ్ మూవీ

  • బన్నీ, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ మూవీ
  • సినిమా గ్లింప్స్ వీడియోకు 35 లక్షలకు పైగా వ్యూస్
  • ఈ స్థాయిలో వ్యూస్ రావడం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇదే తొలిసారి

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘ఏఏ-23’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు ఊహకందని స్థాయికి వెళ్ళిపోయాయి. ఇంకా షూటింగ్ కూడా మొదలవ్వకముందే, కేవలం ఒక చిన్న అనౌన్స్‌మెంట్ వీడియోతోనే ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.


ఈ సినిమా ప్రకటన కోసం విడుదల చేసిన గ్లింప్స్ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 3.55 మిలియన్లకు (35 లక్షలకు) పైగా వ్యూస్ వచ్చాయి. ఇండియాలో ఒక సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోకు ఈ స్థాయిలో సోషల్ మీడియాలో వ్యూస్ రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన పవర్ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ వీడియోను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఆ మ్యూజిక్ వింటుంటేనే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తుండటంతో, ప్రతి ఒక్కరూ ఆ ఆడియోను వాడుతూ రీల్స్ చేసేస్తున్నారు. ఈ అరుదైన ఘనతను నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.


‘పుష్ప’ లాంటి భారీ హిట్ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం ఒక నిమిషం గ్లింప్స్‌కే ఈ రేంజ్ రెస్పాన్స్ ఉంటే, ఇక ముందుముందు వచ్చే టీజర్, ట్రైలర్ ఇంకెన్ని రికార్డులను సాధిస్తాయో అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. 



More Telugu News