"గోలీల (గోటీలు) వ్యాపారంతో రూ.4 కోట్ల ఆదాయం"... నటుడు రాజశేఖర్ ఏమన్నారంటే...!

Rajasekhar Reacts to Marble Business Earning Rumors
  • రాజశేఖర్ గోలీల (గోటీలు) వ్యాపారంతో కోట్లు సంపాదిస్తున్నారంటూ ప్రచారం
  • ఈ విషయంపై ఓ పాడ్‌కాస్ట్‌లో స్పందించిన రాజశేఖర్
  • తనకు గోలీల ఫ్యాక్టరీ లేదని స్పష్టం చేసిన రాజశేఖర్
  • తెలిసిన వాళ్లు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారని వెల్లడి
తనకు గోలీల (గోటీలు) ఫ్యాక్టరీ ఉందని, దీని ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ప్రచారంపై ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ స్పందించారు. "రాజశేఖర్ గోలీల వ్యాపారంతో ఎంత సంపాదిస్తున్నారో తెలుసా. బంగ్లాదేశ్, పాకిస్థాన్, భారతదేశాల్లో గోలీలను విక్రయిస్తూ రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు సంపాదిస్తున్నారు" అంటూ చాలాకాలంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది.

ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో నటుడు రాజశేఖర్ తనకు గోలీల ఫ్యాక్టరీ ఉందని జరుగుతోన్న ప్రచారంపై మాట్లాడుతూ, తనకు అలాంటి ఫ్యాక్టరీ ఏదీ లేదని స్పష్టం చేశారు. గోలీల ఫ్యాక్టరీ అంటూ ట్రెండ్ నడుస్తోందని, కొంతమంది ఇది నిజమేనని అనుకుంటున్నారని తెలిపారు.

నిజానికి తనకు ఎలాంటి గోలీల ఫ్యాక్టరీ లేదని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో చూసి తెలిసిన వాళ్లు కూడా 'నిజమా, గోలీల ఫ్యాక్టరీ ఉందా' అని అడిగారని గుర్తు చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నఆ వీడియోను చూసి, నాకు నేనే... నాకు ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది, కోట్ల రూపాయలు ఎక్కడ సంపాదిస్తున్నానని సరదాగా నవ్వుకున్నానని తెలిపారు.

సినిమాల్లో తనను ఇమిటేట్ చేసిన వారి గురించి కూడా రాజశేఖర్ స్పందించారు. మొదట్లో ఎవరైనా నన్ను ఇమిటేట్ చేస్తే 'నిజంగా ఇలా చేశానా' అని అనిపించేదని అన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనను, హీరో వెంకటేశ్‌ను బాగా ఇమిటేట్ చేస్తారని తెలిపారు. 'రోజ్.. రోజ్.. రోజ్.. రోజా పువ్వా' పాటలో నేను చేసిన డ్యాన్స్ నాకే గుర్తుకు లేదని, కానీ స్టేజ్‌పై దీనిని ఇమిటేట్ చేస్తే నవ్వుకుంటానని అన్నారు.
Go Back to Shorts
Rajasekhar
Rajasekhar actor
Telugu actor
Goti business
Social media rumors
Anil Ravipudi
Venkatesh

More Telugu News