ప‌వ‌న్‌ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' డబ్బింగ్ షురూ

  • పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' డబ్బింగ్ పనులు ప్రారంభం
  • హరీశ్‌ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ ఎంటర్‌టైనర్
  • గబ్బర్ సింగ్ తర్వాత మళ్లీ కలిసిన పవన్, హరీశ్‌, దేవిశ్రీ ప్రసాద్
  • మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయిక
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. దర్శకుడు హరీశ్‌ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డబ్బింగ్ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.

‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కల్యాణ్, హరీష్ శంకర్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో ఈ సినిమా వస్తుండటంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హరీశ్‌ తనదైన శైలిలో రాసిన పవర్‌ఫుల్ డైలాగ్స్‌కు పవన్ డబ్బింగ్ చెప్పనుండటంతో అభిమానుల్లో ఆసక్తి రెట్టింపైంది.

ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూవీ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు డబ్బింగ్ పనులు కూడా మొదలుకావడంతో సినిమాను వేగంగా పూర్తిచేసి, విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


More Telugu News