బీఎంసీ ఎన్నికలు.. 12 మంది జెన్-జెడ్ కార్పొరేటర్లు వీరే...
- అత్యంత పిన్న వయస్కుడు బీజేపీ నుంచి గెలిచిన కాశీష్ పుల్వారియా
- రిజర్వ్ స్థానం 151 వార్డు నుంచి గెలిచిన కాశీష్
- 80 వార్డు నుంచి గెలిచిన జ్యువెలరీ డిజైనర్ దిశా యాదవ్
ఇటీవల జరిగిన బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో నగరవాసులు 12 మంది జెన్-జెడ్ కార్పొరేటర్లను ఎన్నుకున్నారు. వారిలో 22 ఏళ్ల కశీష్ పుల్వారియా అతిపిన్న వయస్కురాలు. ఎన్నికైన వారిలో వైద్యులు, డిజైనర్లు, ఎంబీయే చదివిన వారు ఎందరో ఉన్నారు. ఈ యువ కార్పొరేటర్లు సాంకేతికత, నూతన విధానాల ద్వారా తమ వార్డుల సమస్యలను పరిష్కరించాలని ప్రజలు భావిస్తున్నారు.
కశీష్ ఫుల్వారియా 151వ వార్డు (ఎం-వెస్ట్) నుంచి బీజేపీ టికెట్‌పై విజయం సాధించారు. ఆమె మాజీ కార్పొరేటర్ రాజేష్ ఫుల్వారియా కుమార్తె. కశీష్ ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్నారు. 151వ వార్డు బీసీ (మహిళ)కు రిజర్వ్ చేయడంతో ఆమె బీజేపీ నుంచి పోటీ చేశారు.
80వ వార్డు నుండి దిశా యాదవ్ జ్యువెలరీ డిజైనర్. ఆమె సొంతంగా ఒక స్టార్టప్ నడుపుతున్నారు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు మాజీ కార్పొరేటర్లు కావడం విశేషం. 167వ వార్డు నుంచి ఎన్నికైన డాక్టర్ సమన్ అజ్మీ హోమియోపతి వైద్యురాలు. ఈమె కాంగ్రెస్ నేత అష్రద్ అజ్మీ కుమార్తె.
బీఎంసీ జెన్-జెడ్ కార్పొరేటర్లు వీరే...
డాక్టర్ అదితి కుర్సాంగే (29 సంవత్సరాలు, శివసేన), దక్షత కవ్తాంకర్ (28, బీజేపీ), హైదర్ అలీ షేక్ (28, కాంగ్రెస్), అంకిత్ ప్రభు (29, శివసేన యూబీటీ), దిశా యాదవ్ (29, బీజేపీ), రితేశ్ రాయ్ (29, శివసేన), ఆయేషా ఖాన్ (28, నేషనలిస్ట్ కాంగ్రెస్), రాజుల్ పాటిల్ (29, శివసేన యూబీటీ), నిర్మితి కనాడే (25, శివసేన), సమన్ అజ్మీ (29, కాంగ్రెస్), ఆపేక్ష ఖండేకర్ (29, శివసేన), కశీష్ పుల్వారియా (22, బీజేపీ).